HomeTelugu Trending'కప్పేల' తెలుగు రీమేక్‌ ప్రారంభం

‘కప్పేల’ తెలుగు రీమేక్‌ ప్రారంభం

Malayala movie kappela telu
మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘కప్పేల’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతోంది. సిద్ధు జొన్నల గడ్డ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శారి చంద్రశేఖర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ హాజరై, క్లాప్‌నిచ్చారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు తీసుకు వెళ్లబోతున్నారు. నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) స్ర్కిప్టుని చిత్ర దర్శకుడికి అందించారు.

‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ప్రేమలోని పలు పార్శ్వాలను స్పృశిస్తూ కథ, కథనాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఇతర తారాగణం వివరాలు, టైటిల్‌ త్వరలోనే ప్రకటిస్తాం’ అని తెలిపారు మూవీ డైరెక్టర్‌. ఈ సినిమాకి స్వీకర్‌ అగస్తి సంగీతం అందిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరున్న సిద్దు తో పాటు అర్జున్ దాస్ కూడా కలవడంతో ఒక మంచి కాంబో అంటున్నారు. ఇక ఈ సినిమా కు హీరోయిన్స్ గా ఇద్దరు మలయాళి ముద్దుగుమ్మలు ఫిక్స్‌ అయినట్లు టాక్. పూర్తి వివరాలు అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu