HomeTelugu Newsభారీ తారగణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా

భారీ తారగణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా

8 25డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సెంటిమెంట్ తో పాటు కావాల్సినంత వినోదం కూడా సినిమాల్లో దొరుకుతుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్ లో ప్రత్యేక ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమా కోసం ఏకంగా పాత, కొత్తతరం హీరోలు కలిపి అరడజను మందికి పైగా నటిస్తున్నారట. పాతతరం హీరోలైన రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, బ్రహ్మాజీ, నవదీప్, సునీల్ తో పాటు అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. సుశాంత్ ను ఏ పాత్రకోసం తీసుకున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu