రాజశేఖర్‌ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌


టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజశేఖర్, తన కుటుంబ సభ్యులు బారిన పడ్డారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలాస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వార్తలపై స్పందించారు. త‌న‌తో పాటు భార్య జీవిత‌, పిల్ల‌లు శివానీ, శివాత్మిక‌ల‌కు కూడా క‌రోనా సోకిన విష‌యం నిజ‌మేన‌ని, ప్ర‌స్తుతం ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ‘పిల్లలిద్ద‌రూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత,‌ తాను మాత్రం ఇంకా వైద్యుల సంర‌క్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

CLICK HERE!! For the aha Latest Updates