చరణ్ గురించి త్రివిక్రమ్‌ ఏమన్నాడంటే..!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం’ వినయ విధేయ రామ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చరణ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంటే మనందరి కుటుంబం అని, ఆయన తమ్ముడు పవన్ అంటే మన కుటుంబంలోని వ్యక్తి అని, ఆ తమ్ముడు కొడుకు చరణ్ అంటే.. మన ఇంట్లో పిల్లవాడిని త్రివిక్రమ్ అన్నారు. మెగా కుటుంబం కోసం ముందు చూపుతో కృషీవలునిలా కష్టపడి.. స్వర్గం లాంటి కోటను నిర్మించారని అన్నారు. చరణ్ సింహం లాంటి వ్యక్తి అని, సింహం తొందరగా వేటకు వెళ్ళదని.. వేటకు వెళ్లిందంటే మాత్రం ఆ వేట ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కల్లేదని అన్నారు. రంగస్థలం సినిమా గురించి ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటి అని చెప్పిన త్రివిక్రమ్.. ఆ సినిమా గురించి తన మనసులోని మాటలను చెప్పడానికి వచ్చానని చెప్పాడు.

https://www.youtube.com/watch?v=ZsEq4fDZH9I