HomeTelugu Trendingసెప్టెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో టక్‌ జగదీష్‌

సెప్టెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో టక్‌ జగదీష్‌

Tuck jagadish on ott releas
నేచురల్‌ స్టార్‌ నాని- శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన రెండోవ చిత్రం టక్‌ జగదీష్‌. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్‌. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో టక్‌ జగదీష్‌ ప్రసారం కాబోతుందంటూ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘పండగకు మన ఫ్యామిలీతో..’ అంటూ ప్రోమోను సైతం హీరో నాని విడుదల చేశాడు. భూదేవిపురం చిన్నకొడుకు నాయుడిగారి అబ్బాయి టక్‌ జగదీష్‌ చెబుతున్నాడు మొదలెట్టండి’ అంటూ సినిమాలో నాని చెప్పిన డైలాగ్‌తో ఉన్న ఈ వీడియో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందించారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu