HomeTelugu Trendingటక్‌ జగదీశ్‌ నుండి ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’

టక్‌ జగదీశ్‌ నుండి ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’

tuck song from tuck jagadis
నేచురల్‌ స్టార్‌ నాని నటించిన చిత్రం ‘టక్‌ జగదీశ్‌’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటను ఆయన ఆలపించారు. రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.

‘నిన్నుకోరి’ తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. భూ తగాదాలు.. కుటుంబ విలువలు ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌లుగా నటించారు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu