బంగారు బికినీలో ‘మైనస్ 10 డిగ్రీస్ ఛాలెంజ్’

‘ఆరబోసేందుకు హద్దులేంటి బాస్.. తనివితీరా’ చూసుకోండి అన్నట్టుగా మంచుకొండల్లో ఓ ముద్దుగుమ్మ బంగారు బికినీలో ప్రత్యక్షమైంది. లేలేత అందాల వన్నెలేడి మంచుకొండల్లో కొత్త ఛాలెంజ్‌కి తెరతీసింది. ఒంటిపై ఉండీ ఉండనట్టుగా ఉన్న బంగారు రంగు బికినీ ధరించి ‘మైనస్ 10 డిగ్రీస్ ఛాలెంజ్’ అంటూ బికినీ తళుకులతో కళ్లు జిగేల్ మనిపించేలా చేసింది.

బుల్లితెరపై హొయలు ఒలికిస్తూ ఆరబోతలో వీరవిహారం చేసే శ్రీజిత దే మరోసారి హాట్ అవతారం ఎత్తింది. ఈసారి ఇంకాస్త హాట్ డోస్ పెంచి మంచు కొండల్లో సైతం వేడి పుట్టించే ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం కాశ్మీర్‌కి విహారయాత్రకు వెళ్లిన ఈ అమ్ముడు ఐస్ గడ్డలతో ఆటలాడి బాగా అలసిపోయి చెమటలు పట్టాయో ఏమో కాని.. ఉపశమనం కోసం ఒంటిపై వస్త్రాలను మొత్తం ఒలిచి ఒంపు సొంపుల వయ్యారాలకు బంగారు రంగు బికినీతో కలరింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బంగారు బాతు బికినీ తళతళలు సోషల్ మీడియాను హీట్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీజిత ఫొటోలు బంగారు బికినీ పోజులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి బికినీ షోలు ఈ అమ్మడుకి కొత్తేం కాదు.. గతంలో రెయిన్ బో బికినీ.. బ్లూ, బ్లాక్ పేర్లతో హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేసింది.