HomeTelugu Trendingపేడెత్తుతున్న ఉపాసన.. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న పిక్స్

పేడెత్తుతున్న ఉపాసన.. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న పిక్స్

4 14టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ ఆదర్శంగా నిలిచే పనులు చేస్తోంది ఉపాసన. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఉపాసన ఎప్పటికప్పుడు తన, తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను పంచుకునే ఆమె ఈ సారి పొలంలో పేడెత్తుతున్న పిక్స్ షేర్ చేసి ఆశ్చర్యపరిచింది.

తరచు సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ, నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలను అందించే ఈ మెగా కోడలు.. లాక్‌డౌన్ సమయాన్ని సమర్ధవంతంగా వాడుకుంటూ ఆదర్శప్రాయమైన పనులు చేస్తోంది. తాజాగా తన తండ్రితో కలిసి వ్యవసాయ క్షేత్రంలో ఉల్లాసంగా గడిపింది. ఆవు పేడ ఎత్తుతూ ఫొటోలు దిగింది. ఈ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు ‘డాడీతో పేడ అమ్మాయి’ అంటూ సరదాగా ట్వీట్ చేసిన ఉపాసన.. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశం పై సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం స్పందిస్తూ ఉపాసనను పొగిడింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu