HomeTelugu NewsKlin Kaara: క్యూట్‌ మెగా ప్రిన్సెస్‌ ఫేస్‌ రివీల్‌

Klin Kaara: క్యూట్‌ మెగా ప్రిన్సెస్‌ ఫేస్‌ రివీల్‌

ram charan upasana daughter klin kaara first look

Klin kaara face reveal: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు వైరల్‌ అవుతున్న ఈ వీడియో.. క్లీంకారా ముఖం క్లియర్‌గా కనిపిస్తోంది.

క్లీంకారా జన్మించి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ.. ఫేస్ రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ. తాజాగా అనుకోకుండా మెగా ప్రిన్సెస్‌ ఫేస్‌ కనిపించడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్‌ మెగా ప్రిన్సెస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన జరగండి సాంగ్‌కి మంచి స్పందన వస్తుంది.

మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘ఆర్‌సీ 16’ సినిమాని ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజగా రంగస్థలం డైరెక్టర్‌ సుకుమార్‌తో కూడా ఓ సినిమా ప్రకటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu