HomeTelugu Trendingనా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌: ఉపాసన

నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌: ఉపాసన

6 22మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరారట. తన ఉద్యోగం ఎలా ఉంది అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను అడుగుతున్నారు. విషయమేంటంటే.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్‌కు వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి తనవంతు సాయం చేసేందుకు ఫోరంలోని తెలంగాణ డెస్క్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

‘నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌? వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ‘ఇన్వెస్ట్‌‌ తెలంగాణ’‌ డెస్క్‌లో కూర్చున్నాను’ అని వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు. అంతేకాదు ప్రపంచంలో అత్యాధునిక హెల్త్‌కేర్‌ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు వెల్లడించారు.

6a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu