మహిళా దర్శకులు ఏం చేశారంటే!

మీ టూ మూమెంట్ బాలీవుడ్ పరిశ్రమను షేక్ చేసి పారేస్తోంది. ఇప్పటికే నానా పటేకర్, సాజిద్ ఖాన్, వికాస్ బాల్, రజత్ కపూర్ వంటి ప్రముఖులతో పాటు ఇంకొంతమంది పై ఆరోపణలు రాగా అనేక మంది నటీమణులు, జర్నలిస్టులు తమపై లైంగిక దాడులు జరిగాయంటూ బయటకొచ్చారు. వారికి అనేక మంది సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు.

తాజాగా మహిళా దర్శకులంతా కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంకణ సేన్ శర్మ, నందిత దాస్, జోయా అక్తర్, గౌరి షిండే, మేఘన గుల్జార్, కిరణ్ రావ్, రీమా, అలంకృత శ్రీవాత్సవ్, నిత్యా మెహ్రా, రుచి నరైన్, షోనాలి బోస్ వంటి వారంతా ఒక బృందగా ఏర్పడి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయకూడదని, దాడులకు గురై ఇప్పుడిప్పుడే బయటికొచ్చి తమ బాధల్ని చెప్పుకుంటున్న వారికి అండగా నిలవాలని నిర్ణయించుకుని ఈ మేరకు ప్రతిజ్ఞ కూడ చేశారు.