HomeTelugu Big Storiesవైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' ట్రైలర్‌

వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ ట్రైలర్‌

Uppena Movie Trailer

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకి డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu