HomeTelugu Big Storiesఅవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన వైరాముత్తు

అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన వైరాముత్తు

Vairamuthu Sensational Deci
ప్రముఖ రచయిత వైరాముత్తు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ కురుప్‌ (KURUP) అవార్డును తాను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలు అందించిన ఓఎన్‌వీ కురుప్‌ పేరుపై ఆ రంగంలో విశిష్ట సేవలు అందిస్తోన్న రచయితలకు ప్రతిఏటా కేరళ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటిస్తోంది. ప్రముఖ పాటల రచయిత వైరాముత్తుకు తాజాగా ఈ అవార్డు వరించింది. దీంతో, ఒకానొక సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఇలాంటి వ్యక్తికి ఎంతో విలువైన గౌరవాన్ని ఎలా అందించారు అంటూ పలువురు సినీ ప్రముఖులు, మహిళలు సోషల్‌మీడియా వేదికగా జ్యూరీని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో తన గురించి విమర్శలు తలెత్తడంతో ఓఎన్‌వీ అవార్డును తాను వెనక్కి ఇచ్చేయదలచుకున్నట్లు వైరాముత్తు తాజాగా ప్రకటించారు. జ్యూరీ ఇబ్బందులు ఎదుర్కొవడం తనకి ఇష్టం లేదని.. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తాజాగా వైరాముత్తు ఓ వీడియో కూడా విడుదల చేశారు. అలాగే ఓఎన్‌వీ అవార్డుతోపాటు వచ్చిన మూడు లక్షలను.. కరోనా నియంత్రణ కోసం పోరాటం చేస్తున్న కేరళ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరో రూ.2 లక్షలను కేరళ ప్రభుత్వానికి తన వంతు విరాళంగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu