HomeTelugu Newsపోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'వైశాఖం'!

పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ‘వైశాఖం’!

జయ.బి దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా..
దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా ‘వైశాఖం’ రూపొందుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిక్స్‌ అయిన ఈ సినిమా అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్‌ రేంజ్‌కి వెళ్తుంది. కజక్‌స్థాన్‌లో తీసిన సాంగ్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వుంది. ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌కి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది” అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. జయ దర్శకత్వంలో సినిమా అనగానే బయ్యర్స్‌ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ కూడా పెద్ద స్థాయిలో వుంటుంది కాబట్టి బిజినెస్‌ పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తీస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో వచ్చిన ‘లవ్‌లీ’కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌ నుండి కూడా బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ రావడం హ్యాపీగా వుంది. అలాగే హిందీ, తమిళ్‌ రైట్స్‌ కోసం కూడా ఆఫర్స్‌ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్‌కి నిదర్శనం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu