ఎన్టీఆర్ తో పూజాహెగ్డే రొమాన్స్!

మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే ‘డిజె’ సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ సీన్స్ లో నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా ఎంపిక చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లాన్
చేస్తున్నారు. పూజా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పూజా.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా అమ్మడుకి ఛాన్స్ రావడంతో తెగ సంబరపడిపోతుందట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈలోగా ప్రాజెక్ట్ పై సైన్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది పూజా.