HomeTelugu Newsచంద్రబాబు నివాసం కూల్చివేత ప్రారంభం !

చంద్రబాబు నివాసం కూల్చివేత ప్రారంభం !

15 5
కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నఇంటిని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను ప్రారంభించింది. మూడు రోజుల క్రితమే చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌ నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

దీంతో ఇంటి యజమానిగా లింగమనేని స్పందించారు. తాము నిర్మాణం చేపట్టే నాటికి సీఆర్‌డీఏ లేదని, అందువల్ల అప్పటి పంచాయతీ అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. అయితే ఆ వివరణతో తృప్తి చెందని అధికారులు ఇంటిని కూల్చివేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెస్సింగ్‌ రూమ్‌ తదితరాల కూల్చివేత ప్రక్రియను సీఆర్డీఏ ప్రారంభించింది.

కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్‌డీఏ అధికారులు గతంలో నోటీసులిచ్చారు. వారిని పిలిపించి వాదనలు విన్నారు. వాదనలు విన్నాక 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని లేకపోతే సీఆర్‌డీఏ చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిలో శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు, ఆక్వాడెవిల్స్‌ పేరుతో ఉన్న ఒక కట్టడం, మరో 3 అంతస్తుల భవనం ఉన్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu