HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌తో సురేందర్‌ రెడ్డి మూవీ!

వైష్ణవ్‌ తేజ్‌తో సురేందర్‌ రెడ్డి మూవీ!

Vaishnav tej movie with sur
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి యూత్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో ఆ ఒక్క సినిమాతోనే వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు ముందుకు వచ్చాయి. ఆయన తాజా చిత్రం అన్నపూర్ణ బ్యానర్లో రూపొందనుంది. ఆ తరువాత సినిమాను ఆయన సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చేయనున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోంది.

భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ‘సంతోషం’ .. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందించడం విశేషం. రచయితగా మంచి అనుభవం ఉన్న దశరథ్ అల్లిన కథ కావడంతో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాతనే ఆయన వైష్ణవ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu