HomeTelugu NewsVaishnavi Chaitanya: వాళ్లతో ఫొటో కోసం వెయిట్‌ చేసేదాని.. కానీ ఇప్పుడు!

Vaishnavi Chaitanya: వాళ్లతో ఫొటో కోసం వెయిట్‌ చేసేదాని.. కానీ ఇప్పుడు!

Vaishnavi Chaitanyas emoti Vaishnavi Chaitanya,love me,baby,Tollywood,Dil Raju

Vaishnavi Chaitanya: టాలీవుడ్‌లో ‘బేబి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవీ చైతన్య. ఈ సినిమాతో ఒక్కసారిగా తన లైఫ్‌ మారిపోయింది. యూత్ లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. తాజా ‘లవ్ మీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో వైష్ణవి సందడి చేసింది. వైష్ణవి లుక్‌ నెటిజన్లను కట్టిపడేసింది. లంగాఓణిలో చాలా ముద్దుగా ఉంది వైష్ణవి. ఈ వేదికపై వైష్ణవి చైతన్య మాట్లాడింది.

ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎప్పుడు షూట్ అయింది.. ఎప్పుడు ఆడియో లాంచ్ వ‌ర‌కు వ‌చ్చింద‌న్న‌ది అర్థం కావ‌డ‌వ లేదు. అంతా చాలా ఫాస్ట్ గా జ‌రిగిపోయింది. ఈ టీమ్ అంతా చాలా ఎన‌ర్జిటిక్‌గా, ఫోక‌స్‌తో ప‌నిచేశారు. వాళ్లంద‌రినీ చూసి మోటివేట్ అయ్యేదాన్ని. నేనెంత అలిసిపోయిన‌ప్ప‌టికీ, అంద‌రి ఎన‌ర్జీ చూసి హుషారు వ‌చ్చేది.

Vaishnavi Chaitanya 1 Vaishnavi Chaitanya,love me,baby,Tollywood,Dil Raju

ఈ ‘ల‌వ్ మీ’ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. గ‌తంలో ఆడియో లాంచ్ అంటే చాలా ఎన‌ర్జీతో వెయిట్ చేసేవాళ్లం. నేనూ, మా అమ్మ ఓ ఆడియో లాంచ్‌కి వెళ్లి సినిమా వాళ్ల‌ని చూడ్డానికి దూరంగా నిలుచుని వెయిట్ చేశాం. సినిమావాళ్లు కనిపిస్తారేమోనని .. ఫొటో దిగుదామని వెయిట్ చేసేవాళ్లం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో వేడుక‌కు ఇలాంటి గొప్ప వేదిక మీద ఉన్నాను.

లైఫ్ ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్లిందో త‌ల‌చుకుంటుంటే అస‌లు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంత మంది పెద్ద వారితో ప‌నిచేయ‌డం మ‌ర్చిపోలేని అనుభూతినిస్తోంది. అస‌లు ఈ లెజెండ్స్ అంద‌రిదీ వేరే లోకం. వాళ్ల స్థాయికి అస‌లు రీచ్ కాలేమేమో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ వాళ్లంద‌రి ప‌క్క‌నా నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

కీర‌వాణిగారిని ఫ‌స్ట్ క‌లిసిన‌ప్పుడు చాలా భ‌య‌మేసింది. ప్రొఫెష‌న‌ల్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ముందు కూర్చుని ఓ అన్ ప్రొఫెష‌న‌ల్ అమ్మాయిగా ఓ పాట పాడాను. `నీ వాయిస్ బావుంది పిల్లా.. బాగా పాడుతున్నావు అని ఆయ‌న అన్న‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu