పెళ్లిచూపులు డైరెక్టర్ రెండో సినిమా!

‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తన రెండో ఎవరితో చేస్తాడనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. రానా, వెంకటేష్ లతో సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ తన తదుపరి సినిమా కూడా కొత్తవాళ్లతోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

తనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద హీరోలు సైతం మొగ్గు చూపుతున్నప్పటికీ తరుణ్ మాత్రం ఈ విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఫైనల్ గా కొత్తవారిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు సినిమా లాంఛనంగా మొదలైందని తెలుస్తోంది.

ఇది కూడా న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. ‘పెళ్ళిచూపులు’ సినిమా సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ వారితో సినిమా చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఇందులో భాగంగానే ఈ సినిమాను పట్టాలేక్కిస్తున్నాడు.