HomeTelugu Trendingసిద్దు జొన్నలగడ్డ తో బేబీ హీరోయిన్‌.. ఫస్ట్‌లుక్‌ విడుదల

సిద్దు జొన్నలగడ్డ తో బేబీ హీరోయిన్‌.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Vaishnavi Chaitanya in the

డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SVCC37గా వస్తున్న ఈ సినిమాలో బేబి ఫేం వైష్ణవి చైతన్య‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజు వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా నుండి న్యూ లుక్ ఒకటి విడుదల చేశారు.

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేస్తూ.. వైష్ణవి చైతన్య స్టన్నింగ్ యాక్టింగ్‌ను త్వరలోనే చూసేందుకు రెడీగా ఉండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య ముస్లిం యువతిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు-2 లో నటిస్తున్నాడని తెలిసిందే. వైష్ణవి చైతన్య మరోవైపు Ashish3 లో కూడా నటిస్తోంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu