HomeTelugu Trendingఖాకీ, ఖైదీ సీక్వెల్స్‌పై దృష్టిపెట్టిన కార్తి

ఖాకీ, ఖైదీ సీక్వెల్స్‌పై దృష్టిపెట్టిన కార్తి

Karthi movies sequel
హీరో ‘కార్తీ’ ప్రస్తుతం సౌత్‌లో దూసుకెళ్తున్న స్టార్ హీరో. ఒకవైపు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం కార్తీ స్పెషల్. అందుకే హీరో కార్తిని అందరి అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా సీక్వెల్స్ జోరు నడుస్తోంది. కొత్త కథలతో ప్రయోగాలు చేయడం కంటే, అంతకు ముందే జనాలకు కనెక్ట్ అయిన కంటెంట్ అయితే రిస్క్ ఉండదనే నమ్మకంతో ఉన్నారు. అందుకే సీక్వెల్స్ చేయడానికి హీరోలంతా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కార్తి కూడా అదే బాటలో ముందుకు వెళుతున్నాడు.

కార్తి హీరోగా 2017లో వచ్చిన ‘ఖాకి’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ ఖాకి సినిమాకు వినోద్ దర్శకత్వం వహించాడు. తమిళ పోలిసుల నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోలీస్ ఆఫీసర్‌గా కార్తి నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకుల నుంచి సైతం ఖాకి చిత్రం ప్రశంసలు అందుకుంది.

కార్తి నటించిన మరో మూవీ ‘ఖైదీ’ని కూడా సీక్వెల్ చేయబోతున్నారు. ఖైదీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను వసూళ్ల వర్షం కురిపించింది.

ఖాకీ, ఖైదీ సినిమాల సీక్వెల్స్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు హీరో కార్తి. ‘జపాన్’ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న కార్తి సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu