నా వాయిస్ పై అనుమానం ఉండేది!

నిన్న విడుదలైన ‘ఫిదా’ సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే సినిమా విడుదలైన సాయంత్రానికే చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. ఈ సంధర్భంగా మాట్లాడిన నటి సాయి పల్లవి.. నేను తెలంగాణ అమ్మాయినని నమ్ముతారా అనే భయం ఉండేది. కానీ భానుమతిని యాక్సెప్ట్ చేశారు. వరుణ్ వచ్చినప్పుడు క్లాప్స్ కొడతారని తెలుసు కానీ నేను డైలాగ్స్ చెబుతుంటే క్లాప్స్ కొడతారని తెలియదు.
నిజాయితీగా చెబుతున్నా.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. శేఖర్ గారు అటువంటి పాత్రలో నేను చేయగలనని నమ్మి ఇచ్చారు. మళ్ళీ ఇంకో అమ్మాయికి ఇలాంటి పాత్ర వస్తుందో.. రాదో తెలియదు. ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ భానుమతి. మొదట నా వాయిస్ పై నాకు అనుమానం ఉండేది. కానీ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తున్న తీరుతో అనుమానం పటాపంచలైంది. ఈ సినిమాకు మంచి పేరు వస్తే అది శేఖర్ గారు చూపించిన సహనానికే లభిస్తుందని అన్నారు.