HomeTelugu Trending'వకీల్‌సాబ్‌' ఫస్ట్‌సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

‘వకీల్‌సాబ్‌’ ఫస్ట్‌సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

6 5
టాలీవుడ్‌ హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫస్ట్‌సాంగ్‌ ప్రోమోను విడుదల చేసింది.

‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ అంటూ సాగే పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 10గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu