HomeTelugu News'వాల్మీకి' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

14 10యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. తొలుత ఈ చిత్రాన్ని సెప్టెంబరు 6న విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసింది.

‘దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్‌ ఇది. ‘ఎఫ్‌ 2’ హిట్‌ తర్వాత వరుణ్‌తేజ్‌ ఇందులో నటిస్తున్నారు. ఆయన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి తెలిసింది. హరీశ్‌ శంకర్‌ మెగా ఫ్యామిలీకి ‘గబ్బర్‌ సింగ్‌’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించారు. దీంతో ‘వాల్మీకి’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu