HomeTelugu Trendingబాలయ్య సినిమాలో లేడీ విలన్‌.. ఎవరో తెలుసా!

బాలయ్య సినిమాలో లేడీ విలన్‌.. ఎవరో తెలుసా!

12 6నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ మిగిల్చిన చేదు అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బయోపిక్ తరువాత బాలయ్య రవికుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మే 17 వ తేదీన సినిమా ప్రారంభం కాబోతున్నది. జైసింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండ్ విలన్ జగపతిబాబు మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు.

ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే… ఈ చిత్రంలో జగపతిబాబుతో పాటు మరో లేడీ విలన్ కూడా ఉంటుందట. తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేసి మెప్పించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu