HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌!

అల్లు అర్జున్‌ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌!

Varalakshmi Sarathkumar in
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో బీజీగా ఉన్నాడు. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం స్కిప్టు పని కూడా ఓపక్క జరుగుతోంది. ప్రస్తుతం తాను చిరంజీవి, రామ్ చరణ్ లతో చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం పూర్తయిన వెంటనే దర్శకుడు కొరటాల ప్రాజక్టుపై పూర్తిగా దృష్టి పెడతారు.

ఈ క్రేజీ ప్రాజక్టులో అల్లు అర్జున్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషించనుందని తెలుస్తోంది. ఆమెది కూడా చాలా పవర్ ఫుల్ పాత్ర అని అంటున్నారు. ఇటీవల వచ్చిన ‘క్రాక్’, ‘నాంది’ సినిమాలలో కీలక పాత్రలు పోషించిన వరలక్ష్మి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu