వర్మ ఇక చిరుని వదలడా..?

ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మెగాహీరోలను టార్గెట్ చేస్తున్నాడనే విషయాన్ని ఆయన ట్వీట్స్ ను చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పై కామెంట్ల వర్షం కురిపించిన వర్మ ఇప్పుడు మెగాస్టార్ పై పడ్డాడు. చిరు 150వ సినిమా మొదలైనప్పటి నుండి సినిమా కోసం ఏదొక ట్వీట్ చేస్తూనే ఉంటున్నాడు. అది పాజిటివ్ గా అయితే వేరే మేటర్ కానీ ఏకంగా చిరుపై ఆయన లుక్స్ పై పోస్టర్ డిజైన్స్ పై కామెంట్స్ చేస్తుండడం మెగాభిమానుల ఆగ్రహానికి కారణమవుతుంది.
chiranjeevi
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఇటీవల సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో చిరు పెద్ద కత్తిని పట్టుకొని చైర్ లో కూర్చొని ఎవరికో వార్నింగ్ ఇచ్చేలా స్టిల్ ఉంది. ఇదిగో ఈ పోస్టరే వర్మ మరో వివాదానికి దారి తీసింది. ఈ పోస్టర్ డిజైన్ చేసిన డిజైనర్ కు, చిరుని ఒప్పించిన డైరెక్టర్ కు పాదాభివందనం చేయాలి. డిజైనర్ కు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం సగం రాసిచ్చెయొచ్చని కామెంట్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తరువాత అయినా.. వర్మ తన ట్వీట్లకు ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి..!