మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకుంటా!

హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలో దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. ఎంత తొందరగా పెళ్లి చేసుకుందో.. అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంది. విజయ్ తల్లితండ్రులతో గొడవల కారణంగానే విడాకులు తీసుకుందని కొందరు అంటుంటే.. వీరి వివాహబంధం విఫలమవ్వడానికి కారణం ఓ సినిమా అని మరికొందరు అంటున్నారు. ఇప్పటికీ కూడా వీరి విడాకులకు సరైన కారణం తెలియలేదు. అయితే పలు సంధార్భాల్లో ఈ విషయంపై స్పందించిన అమల.. పెళ్లి, విడాకులు రెండు కూడా తొందరపాటు వల్లే జరిగాయని స్పష్టం చేసింది. కొంతకాలంగా సినిమాలతో బిజీగా ఉన్న అమల గతవారం సుచిలీక్స్ పై స్పందించి వార్తల్లోకెక్కింది.
తాజాగా తన పెళ్లి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుగా వెల్లడించింది. నేనేమైనా.. సన్యాసం తీసుకుంటానని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించిన అమల తను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అది కూడా ప్రేమ వివాహమే అని తన మనసులో మాటను వెల్లడించింది. నన్ను ప్రేమించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను అని స్పష్టం చేసింది. మొదటిసారి చేదు అనుభవాన్ని చవిచూసిన అమలా.. రెండో ప్రేమకథలో అయినా.. తనకు తగ్గ జీవితభాగస్వామిని ఎన్నుకుంటుందో.. లేదో.. చూడాలి!
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here