వర్మ డైరెక్షన్ లో బాలయ్య..?

తాజాగా బాలకృష్ణ, ‘సర్కార్3’ సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి అమితాబ్ ను, రామ్
గోపాల్ వర్మను కలిసి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఓ
తాజా వార్త హల్ చల్ చేస్తోంది. ఒకప్పుడు దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వర్మతో సినిమా
చేయాలని చాలా మంది హీరోలు అనుకున్నారు. బాలకృష్ణ కూడా చేస్తారనే అనుకున్నారు.
కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే
వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో, బాలకృష్ణ నటించనున్నాడని
అందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడనేదే ఆ వార్తల సారాంశం. మరి ఈ విషయంపై
వర్మ ఏం చెప్తాడో.. చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన ‘సర్కార్ 3’ సినిమా షూటింగ్ లో బిజీగా
గడుపుతున్నాడు!

CLICK HERE!! For the aha Latest Updates