HomeTelugu Newsబాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌

బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌

2 25
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. అందులో భాగంగా ఫిదా , తొలిప్రేమ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న తరువాత అంతరిక్షం అంటూ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అయితే మళ్ళీ సక్సెస్ బాట పట్టిన వరుణ్ ఇటీవల గద్దల కొండ గణేష్ సినిమా తరువాత వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫిదా , తొలిప్రేమ, ఈ ఏడాది వచ్చిన ఎఫ్ 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు వరుణ్ తేజ్. ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకోసం ప్రొఫెషనల్ బాక్సర్ల దగ్గర వరుణ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu