HomeTelugu Trendingగని: వరుణ్‌ బర్త్ డే స్పెషల్ టీజర్‌

గని: వరుణ్‌ బర్త్ డే స్పెషల్ టీజర్‌

Varun Tej Birthday Special

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ నేపధ్యంలో వరుణ్‌ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమా నుండి ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘కొంతమంది యోధులుగా తయారవుతారు’ కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu