HomeTelugu Newsఇంట్లోనే కిక్ బాక్సింగ్ చేస్తున్న వరుణ్ తేజ్

ఇంట్లోనే కిక్ బాక్సింగ్ చేస్తున్న వరుణ్ తేజ్

10 10
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం షూటింగులు లేకపోవడంతో కుటుంబ సభ్యులతోనే హ్యాపీగా గడిపేస్తున్నారు. కరోనా కారణంగా సెలబ్రిటీలకు జరిగిన నష్టం కంటే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం దక్కడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే తనలోన దాగివున్న టాలెంట్లను బయటపెడుతున్నారు. తాజాగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల గద్దలకొండ గణేష్‌తో హిట్ కొట్టిన వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా జిమ్‌లు కూడా మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ ఇంట్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో మెళకువలు నేర్చుకున్న వరుణ్‌ ఇంట్లో బాక్సింగ్ బ్యాగ్ హిట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu