ఇద్దరు భామలతో రవితేజ రొమాన్స్‌!


మాస్‌ మహారాజా ర‌వితేజ తాజాగా ’68వ ప్రాజెక్టు’ను ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఖిలాడీ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించ‌బోతున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళ భామ ఐశ్వ‌ర్య‌మీన‌న్‌, క‌న్నడ శ్రీలీల మాస్‌మ‌హారాజాతో క‌లిసి స్టెప్పులేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై టీజీ విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates