HomeTelugu Trendingవరుణ్‌ తేజ్‌ న్యూ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

వరుణ్‌ తేజ్‌ న్యూ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

Varun Tej New Movie Title a

హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘గాండీవధారి అర్జున’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్‌ మూవీ టైటిల్‌ ప్రకటించారు.

సోనీ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వైమానిక దాడుల నేపథ్యంలో .. భారీ యాక్షన్ దృశ్యాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కి ఇది 13వ సినిమా. ఇందులో ఆయన IAF ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా ‘రాడార్’ ఆఫీసర్ పాత్రలో ‘మానుషి చిల్లార్’ అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన విడుదల కానున్నట్లు ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు.

 

20230814fr64d9e56f5d29f

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu