HomeTelugu Trendingవరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా 'మట్కా'

వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ‘మట్కా’

varun tej vt14 movie titled

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు సినిమాలు ఆల్రెడీ సెట్స్‌ మీద ఉన్నాయి. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు వరుణ్‌ తేజ్‌. కరుణ్ కుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమాను గురువారం గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

నోట్ల కట్టల మధ్య రాయల్‌ కారును చూపిస్తూ పోస్టర్‌ను ఆసక్తికరంగా డిజైన్‌ చేశారు.1960వ దశాబ్ధంలో ఈ సినిమా కథ రూపొందనుందని తెలుస్తుంది. నానితో హాయ్‌ నాన్న చేస్తున్న వైరా సంస్థలోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. మూడేళ్ల కిందట వచ్చిన పలాసతో కరుణ్‌ కుమార్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా సక్సెస్‌ కాకపోయినా.. దర్శకుడు కరుణ కుమార్‌ టేకింగ్‌కు యావత్‌ టాలీవుడ్‌ ఇండస్ట్రీ మెచ్చుకుంది.

యాక్షన్ సీన్స్‌ను రియలిస్టిక్‌గా చూపించిన విధానం అందరినీ ఫిదా చేసింది. ఈ దర్శకుడు మెగా ప్రిన్స్‌ సినిమా చేస్తుండటంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనుంది. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ సినిమాకు తమిళ కంపోజర్‌ జీవి. ప్రకాష్‌కుమార్‌ స్వరాలిందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu