HomeTelugu Trendingముగ్గురు హీరోయిన్‌లతో రామ్‌ రొమాన్స్‌

ముగ్గురు హీరోయిన్‌లతో రామ్‌ రొమాన్స్‌

1 28

హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయం సాథించాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన రామ్‌ ఇప్పుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు రామ్ తో కలిసి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు చేశారు. ఈ రెండు కూడా లవ్ ఓరియెంటెడ్ సినిమాలు. అయితే, ఈ మూవీ పక్కా మాస్ మూవీలా కనిపిస్తోంది. తమిళంలో హిట్టైన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఇందులో రామ్‌ సరసన ముగ్గురు హీరోయిన్‌లు నటించనున్నట్లు తెలుస్తోంది. మాళవిక శర్మ, నివేత పేరురాజ్ లు ఇప్పటికే హీరోయిన్లు. కాగా, ఇప్పుడు మూడో హీరోయిన్, తమిళ సుందరి అమృత అయ్యర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. సో, మొత్తానికి ఈ హీరో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే మామూలు విషయం కాదు. మరో నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu