HomeTelugu TrendingVD12 కోసం టాప్‌ టెక్నీషియన్స్‌

VD12 కోసం టాప్‌ టెక్నీషియన్స్‌

VD12 Movie Update

రౌడీ హీరో విజయ్ దేవరకొండ- గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం VD12. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సౌతిండియా టాప్‌ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. పాపులర్‌ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్‌ గంగాధరన్‌ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు.

గిరీష్‌ గంగాధరన్ గతేడాది కమల్ హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాకు పనిచేశాడు. అంతేకాదు అంగమలై డైరీస్‌, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేశారు. హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న VD12 చిత్రాన్ని గిరీష్‌ కెమెరా వర్క్‌ మరోస్థాయికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్‌. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం భాగస్వామ్యం కాబోతుంది. విజయ్‌ దేవరకొండ మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. గౌతమ్‌ తిన్ననూరి దీంతోపాటు రాంచరణ్‌తో కూడా సినిమాను ప్రకటించాడు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu