HomeTelugu Trendingహోస్ట్‌గా మారనున్న వెంకటేశ్!

హోస్ట్‌గా మారనున్న వెంకటేశ్!

Venkatesh as host in aha ot

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రానా వంటి వారు హోస్ట్ గా చేసిన కార్యక్రమాలు భారీ రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా విక్టరీ వెంకటేశ్ హోస్ట్‌గా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆహా’ కోసం ఆయన హోస్టుగా కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమాలతో .. వెబ్ సిరీస్ లతో కొత్త కాన్సెప్ట్ లతో ‘ఆహా’ దూసుకెళుతోంది.

‘ఆహా’లో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ ఇప్పటికే నెంబర్ వన్ గా నిలిచింది. దాంతో కొత్తగా మరో షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం హోస్టుగా వెంకటేశ్ ను సంప్రదిస్తున్నారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అంటున్నారు. వెంకీని హోస్టుగా చూడాలనే అభిమానుల ముచ్చట ఈ ఏడాది తీరుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!