HomeTelugu Trendingవిశ్వక్‌ సేన్‌ మూవీలో వెంకటేష్‌!

విశ్వక్‌ సేన్‌ మూవీలో వెంకటేష్‌!

Venkatesh in Vishwak Sen mo
టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వ‌క్ సేన్ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవ‌లే ఈయ‌న న‌టించిన ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్ర‌స్తుతం విశ్వ‌క్ సేన్ మూడు సినిమాల‌ను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘ఓరి దేవుడా’ మూవీ ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘ఓమై క‌డువ‌లే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కతుంది. ఒరిజ‌నల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన అశ్వత్ మ‌రిముత్తు రీమేక్ చిత్రాన్నికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. కాగా ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో విజ‌య్ సేతుప‌తి దేవుడి పాత్ర‌లో న‌టించాడు.

తెలుగులో ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారా… అనుకుంటున్నా..ఈ క్రమంలో.. ఈ పాత్ర‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో దేవుడి పాత్ర‌లో విక్టరీ వెంక‌టేష్ న‌టించ‌నున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌. అంతేకాకుండా మూడు రోజుల్లోనే ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu