HomeTelugu Big Storiesవెంకీమామ మూవీ రివ్యూ..

వెంకీమామ మూవీ రివ్యూ..

2a 2

విక్టరీ వెంకటేష్‌‌, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వెంకీమామ’. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనే అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్‌ సినిమాపై మంచి క్రేజ్‌ ఉంటుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తున్నాడు. రాశి కన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నాజర్‌, రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర, గీత, కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ‘గురు’,, ఎఫ్‌-2 సినిమాలతో మంచి జోష్‌లో వెంకీ, ‘మజిలీ’ సూపర్‌హిట్‌ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి.

కథ: రామబ్రహ్మం (నాజర్‌) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా దంపతులిద్దరు రోడ్డుయాక్సిడెంట్‌లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి చిన్నారి కొడుకును చేరదీయడానికి రామబ్రహ్మం నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేష్‌‌) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్‌ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్‌.. కార్తీక్‌ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్‌ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్‌ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్‌కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? అనేది కథలోని అంశం.

3 12

నటీనటులు: హీరో వెంకటేష్‌ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్‌, డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయంలో ఆయన దిట్ట. మిలటరీ నాయుడు అలియాస్‌ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్‌ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా మెచ్యూర్డ్‌ ఫర్ఫార్మెన్స్‌ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్‌ రాజపుత్‌, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. కామెడీ, పాటలు మినహా హీరోయిన్‌ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్‌, గీత, ప్రకాశ్‌ రాజ్‌, రావూ రమేశ్‌, కిషోర్‌, హైపర్‌ ఆది తమ పాత్రలతో మెప్పించారు.

విశ్లేషణ: మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. మొదటిభాగం అంతా కామెడీతో ఎంటర్‌టైన్‌గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్‌ అలాగే అనుకోవడం, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్‌ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్‌, బ్రేకప్‌ వంటి సీన్లతో, కామెడీతో, పాటలతో ఫస్టాప్‌ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిష ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు.. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు.

2 13

హైలైట్స్‌ :మామ-అల్లుళ్ల నటన

డ్రాబ్యాక్స్ : కొన్ని సన్నివేశాలు

టైటిల్ : వెంకీ మామ
నటీనటులు: వెంకటేశ్‌, నాగచైతన్య, రాశి కన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ తదితరులు
దర్శకత్వం : బాబీ
నిర్మాత సంస్థ : సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌
సంగీతం : థమన్‌

చివరిగా : అదరగొట్టిన ‘వెంకీమామ’

Recent Articles English

Gallery

Recent Articles Telugu

విక్టరీ వెంకటేష్‌‌, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'వెంకీమామ'. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనే అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్‌ సినిమాపై మంచి క్రేజ్‌ ఉంటుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తున్నాడు. రాశి కన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నాజర్‌, రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర,...వెంకీమామ మూవీ రివ్యూ..