బాబాయ్ ట్రైలర్ పై అబ్బాయిల కామెంట్స్!

నందమూరి బాలకృష్ణకు, హరికృష్ణ కుటుంబానికి మధ్య సత్సబంధాలు లేవనే టాక్ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటలకు చెక్ పెడుతూ కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు బాలయ్యను ప్రశంసించారు. డిసంబర్ 16న కరీంనగర్ లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

ఈ ట్రైలర్ పై నందమూరి హీరోలు తమదైన స్టయిల్ లో స్పందించారు. బాబాయ్ టైలర్ లో చాలా గొప్పగా కనిపించాడనీ.. ఆయన కెరీర్ లో ఇది బెస్ట్ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాబాయ్ లుక్స్ ఔట్ స్టాండింగ్ అంటూ ప్రశంసించాడు నందమూరి కల్యాణ్ రామ్. వీరిద్దరు ఇలా స్పందించడం నందమూరి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.