HomeTelugu Trending'వెంకిమామ' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా..!

‘వెంకిమామ’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా..!

4 27విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్యలు హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. సినిమా ప్రమోషన్ చిత్రాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ సాంగ్, నాగ చైతన్య గ్లింపేజ్ ఆకట్టుకోవడంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగచైతన్య ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అటు వెంకటేష్ పక్కా పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ విషయం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అయ్యింది.

పెట్టిన బడ్జెట్ ను వెనక్కి రాబట్టేందుకు సరైన విడుదల తేదీ కోసం ఎదురు చేస్తున్నారు. ఆ డేట్ ఎప్పుడు ఏంటి అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. మొదట సంక్రాంతి అనుకున్నా ఆ సమయంలో మిగతా సినిమాలు ఉండటంతో డిసెంబర్ 13 న విడుదల చేయాలని అనుకున్నారు. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు. కానీ, ఆరోజు కూడా కాకుండా డిసెంబర్ 25 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu