HomeTelugu Trendingబాలయ్య సినిమాలో హీరో వేణు?

బాలయ్య సినిమాలో హీరో వేణు?

1 11
టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మాజీ హీరో తొట్టెంపూడి వేణు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే వేణు ఇంతక ముందు బోయపాటి దర్శకత్వం లో వచ్చిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ కు బావగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాత్ర చాల కీలకం అని తెలుస్తుంది. అందుకే ఈ హీరోను ఎంచుకుంటు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu