HomeTelugu Big Storiesఆస్పత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌

Veteran actor dilip kumar h

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌ (98) ఆస్పత్రిలో చేరారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో దిలీప్‌కు ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ముంబయిలోని ఖార్‌ హిందుజ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, దిలీప్‌కుమార్‌ ఆరోగ్యంగా ఉండాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

దిలీప్‌కుమార్‌ అసలు పేరు మహమ్మద్‌ యూసఫ్‌ ఖాన్‌. 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ‘జోగన్‌’, ‘బాబుల్‌’, ‘దేవ్‌దాస్’, ‘ఫుట్‌పాత్‌’, ‘అజాద్‌’ ‘లీడర్‌’, ‘కోహినూర్‌’, ‘ధునియా’ వంటి సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరిసారిగా 1998లో ‘ఖిలా’ చిత్రంలో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu