పోలీస్ ఆఫీసర్ గా గంటా వారబ్బాయి!

మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు. అయితే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. గంటా రవితేజ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పట్లో ‘కాళహస్తి’ అనే సినిమాను కూడా మొదలుపెట్టారు. ఆ సినిమా సంగతి ఏమైందో.. గానీ తాజాగా ఆయన హీరోగా మరో సినిమా మొదలవుతోంది. ఇది తమిళ ‘సేతుపతి’ చిత్రానికి రీమేక్ అని సమాచారం. విజయ్ సేతుపతి, రమ్య నంబిసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు.

ఈ సినిమాల్లో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ కనిపించి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. తన కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో నటించడానికి గంటా రవితేజ రెడీ అయిపోతున్నాడు. ఈ చిత్రానికి జయంత్ సి.పరాంజీ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.