HomeTelugu Trendingచిరంజీవి సోదరిగా విద్యాబాలన్‌!

చిరంజీవి సోదరిగా విద్యాబాలన్‌!

Vidya Balan as a chiranjeev
మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లూసిఫర్‌’. ఈ రీమేక్‌లో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించనుందనే వార్తలు వస్తున్నాయి. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఆమె చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ‘లూసిఫర్’ సెట్స్‌పైకి వెళ్లనుంది. నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక విద్యాబాలన్‌ నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘షేర్నీ’. జూన్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్‌కానున్న‌ది. ఈ సినిమాలో విద్యాబాలన్‌ ఫారెస్ట్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu