విద్యబాలన్ మనసు దోచిన హీరో!

బాలీవుడ్ తార విద్యాబాలన్ ఓ తెలుగు హీరో సినిమాలో నటించాలనుందని చెబుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరూ నవమన్మధుడు కింగ్ నాగార్జున. ఐదు పదుల వయసు దాటుతున్నా.. తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు కాబోతున్నా.. ఇప్పటికీ యంగ్ గా అందరిలో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో నాగార్జున. తెలుగునాట ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫ్యామిలీ లేడీస్ లో  ఆయనకున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే.

ఒకప్పటి బాలీవుడ్ తారలు టబు, మనీషా కోయిరాల, ప్రీతి జింటా, కరిష్మా కపూర్ ఇలా చాలా మంది తారలు ఆయన అభిమానులే. ఇప్పుడు వారి లిస్ట్ లో విద్యాబాలన్ పేరు వినిపిస్తోంది. కహానీ2 సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్  వచ్చిన విద్యాబాలన్ కు తెలుగులో మీకు నచ్చే నటుడు ఎవరని ప్రశ్నించగా.. మరొక ఆలోచన లేకుండా వెంటనే నాగార్జున పేరు చెప్పడం విశేషం.  అంతేకాదు అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించాలనుందని తన మనసులో మాటను వెల్లడించింది.