HomeTelugu TrendingVidya balan: హీరోలు తనతో నటించడానికి ఇష్టపడేవారు కాదట!

Vidya balan: హీరోలు తనతో నటించడానికి ఇష్టపడేవారు కాదట!

Vidya balan interesting comments on bollywood stars

Vidya balan: బాలీవుడ్‌ నటి విద్యాబాలన్ ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు మునుపటిలా స్పీడ్‌గా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు విద్యా బాలన్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంది. విద్య బాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వూలో తన మొదటి లవ్ గురించి, తన మొదటి బాయ్‌ఫ్రెండ్ మోసం గురించి చెప్పింది. అతని వల్ల తాను దారుణంగా మోసపోయాను అని విద్యా తెలిపింది. అంతే కాదు బాలీవుడ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది విద్య బాలన్.

నేను ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయాను. నేను డేటింగ్ చేసిన మొదటి వ్యక్తి నన్ను మోసం చేశాడు. మాకు బ్రేకప్ అయింది. ఓ ప్రేమికుల రోజున కాలేజీలో అతనితో గొడవ పడ్డాను. దాంతో అతనను నాతో.. ‘నేను నా మాజీ ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నాను’ అని చెప్పాడు. దాంతో నా గుండె బద్దలైంది.ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నేను నా జీవితాన్ని చాలా మార్చుకున్నా.. నేను కొంతమందిని ప్రేమించాను కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్ పెట్టుకోలేదు అని తెలిపింది విద్య బాలన్.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది. వాటిని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. కొందరు నటులు ఆ విషయాన్ని సహించలేరు. ఎవరు అంగీకరించినా లేకున్నా ఇది మాత్రం నిజం. నేను ఎక్కువగా ఇలాంటి సినిమాలే చేస్తాను కాబట్టి నాతో నటించేందుకు కొందరు స్టార్లు ఇష్టపడరు. ఈ విషయంలో నేనేం బాధపడను. నాకంటే బాలీవుడ్‌లో ఓ క్రేజ్‌ ఉంది. సినిమా పరిశ్రమలో నెపోటిజం ఉందంటే నేను అంగీకరించను. ఒకవేళ నెపోటిజం ఉండి ఉంటే తారల పిల్లంతా సక్సెస్‌ అయ్యేవారు.

పరిశ్రమ ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. నేను కిందిస్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. కాబట్టే నాపై ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది. నా కుటుంబంలో ఎవరైనా సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నట్లైతే నా గుర్తింపు వేరుగా ఉండేది. నాకు వచ్చిన అవకాశాలన్నీ నటన వల్ల వచ్చాయి కానీ, నా నేపథ్యం చూసి రాలేదు అని అన్నారు.

విద్యాబాలన్ ప్రస్తుతం ‘దో ఔర్ దో ప్యార్’ సినిమాలో నటిస్తోంది. ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాలో ఇలియానా డిక్రూజ్ కూడా నటిస్తుంది. ఇది రొమాంటిక్ కామెడీ సినిమా. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. విద్య నటించిన డర్టీ పిచర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu