HomeTelugu Trendingనయన్‌కు ప్రియుడి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

నయన్‌కు ప్రియుడి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Vignesh Shivan Special Birt
నేడు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పుట్టిన రోజు. ఈ రోజుతో నయన్‌ 37 వసంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ, అభిమానుల ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కూడా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. నయన్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే బంగారం(తంగమై).. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో, నిజాయితీగా ఉండు. భగవంతుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు.

పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో నిండిన మరో సంవత్సరాన్ని ఎంజాయ్‌ చేయ్‌’ అని పేర్కొన్నారు. కాగా వీరు దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘నెట్రికన్‌’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేశ్‌‌ శివన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu