దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం!

యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ టాక్సీవాలా తరువాత చేస్తున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమాలో గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టూడెంట్ పాలిటిక్స్ గురించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తున్నది.

ఇదిలా ఉంటె, ఈ సినిమాకు చెందిన ఓ చిన్న ట్రైన్ సీన్ లీక్ అయింది. రైల్వే స్టేషన్ లో రైలు కదులుతుండగా.. విజయ్ దేవరకొండ వాకర్స్ బ్రిడ్జి నుంచి గబగబా దిగి.. పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ కదిలే సమయంలో షూట్ చేస్తుండగా.. విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కబోతాడు. అంతలో సడెన్ గా కాలు స్లిప్ అవుతుంది. వెంటనే వెనుకనుంచి మరొకరు వచ్చి పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సీన్ కు సంబంధించిన చిన్న క్లిప్ ఇప్పుడు వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.